Yuvraj Singh Suggestions for Asia Cup 2025 | ఆసియా కప్ ఆటగాళ్లకు యూవీ సలహా

ఆసియా కప్ లో భారత్ ఎలాగైనా కప్ గెలవాలని కసిగా ఉంది. అయితే ఈ సారి జరిగే టోర్నమెంట్ లో చాలామంది యువ ఆటగాళ్లు ఉన్నారు. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి యంగ్ ప్లేయర్స్ కు ఒక సలహా ఇచ్చారు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. ఆసియా కప్ 2025 ముందు వీరిని గోల్ఫ్ ఆడమని చెప్పారు. గోల్ఫ్ ఆడకపోవడం తన కెరీర్ లో చేసిన మిస్టేక్ అని అన్నారు. వాళ్లకు గోల్ఫ్ ఆడే టైం దొరకడం కష్టమే.. కానీ IPL ఆడే టైములో కొంత సమయం కేటాయించుకోవచ్చు అని తెలిపారు. ప్రస్తుతం క్రికెట్ లో వాలే సూపర్ స్టార్స్. ఎం చేస్తే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారో అనేది వారే నిర్ణయం తీసుకోవాలి. గోల్ఫ్ ఆడడం వల్ల మైండ్ రిలాక్స్ అయి మెంటల్ స్ట్రెస్ తగ్గించి... క్రికెట్ పర్ఫార్మాన్స్ ఇంప్రూవ్ చేస్తుందని అన్నారు. అలాగే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లో గోల్ఫ్ ట్రెడిషన్ చూస్తే... చాలామంది టాప్ క్రికెటర్స్ చిన్నప్పటి నుంచి గోల్ఫ్ ఆడినవారే. క్రికెటర్లు టూర్‌లలో ఎక్కువ గోల్ఫ్ ఆడతారు. తక్కువ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తారు అని అన్నారు యువరాజ్ సింగ్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola