Team India Playing 11 in Asia Cup 2025 | ఆసియా కప్ లో రింకూ బదులుగా దుబే ?
ఆసియా కప్ 2025 ( Asia Cup 2025 ) కోసం ఇండియా టీం ను ప్రకటించిన తర్వాత ప్లేయింగ్ 11 పై చర్చ మొదలయింది. ఎంతోమంది సీనియర్ ప్లేయర్స్.. భారత్ ప్లేయింగ్ 11ను అంచనా వేయడం మొదలు పెట్టారు. అయితే ప్లేయింగ్ 11 పై క్రికెట్ విశ్లేషకుడు ఆకాష్ చోప్రా ( Akash Chopra ) ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రింకూ సింగ్ ( Rinku Singh ) ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకోవడం కాస్త కష్టమే అని అంటున్నారు. రింకు స్థానంలో మరో ఆల్-రౌండర్ ఆడే అవకాశం ఉందని అయిన సూచిస్తున్నారు. అయితే 2024, 2025 ఐపీఎల్ సీజన్లలో రింకూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అలాగే రింకూ ఫినిషర్‌గా మాత్రమే పరిమితం అవుతున్నాడు. బౌలింగ్ చేయకపోవడం కూడా అతడికి ఒక మైనస్ పాయింట్ అని అంటున్నారు ఆకాష్ చోప్రా. రింకూ సింగ్ స్థానంలో అల్ రౌండర్ శివమ్ దూబే ( Shivam Dube)కు అవకాశం ఇస్తే బాగుంటుందని ఆకాష్ చోప్రా అంటున్నారు. దూబే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. ఇది టీం కు ప్లస్ అవుతుంది. హార్దిక్ పాండ్యా ( Hardik pandya ), జితేష్ శర్మ ( Jitesh Sharma ) వంటి ప్లేయర్స్ టీం లో ఉన్నప్పుడు రింకూ సింగ్ కు చోటు దొరకడం కష్టమే అని అంటున్నారు ఆకాష్ చోప్రా.