WTC Final India | టీమిండియా టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఇదొక్కటే దారి
కోల్‌కాతా టెస్ట్‌లో టీమిండియా ఓటమి తర్వాత ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భారత్ నిలబడటం అనుమానంగా మారింది. ఇప్పటివరకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా.. మిగిలిన అన్ని టీమ్స్ కంటే చాలా ఎక్కువగా 8 టెస్ట్‌లు ఆడి.. అందులో కేవలం నాలుగు టెస్ట్‌ల్లో గెలిచి.. మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఈ సైకిల్‌లో కేవలం 54.17 పాయింట్స్‌తో నాలుగో ప్లేస్‌కి పరిమితమైపోయింది. సాధారణంగా WTC ఫైనల్‌కు అర్హత పొందేందుకు అవసరమైన PTC 64% నుంచి 68% మధ్య ఉండాలి. కానీ టీమిండియా దగ్గర కేవలం 54 పర్సెంట్ పాయింట్సే ఉండటంతో.. ఇక్కడి నుంచి టీమిండియా టాప్-2లోకి చేరడం దాదాపు కష్టంగా కనిపిస్తోంది. అయితే అసాధ్యమైతే కాదు. ఎందుకంటే.. భారత్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో ఒక టెస్ట్ మ్యాచ్, శ్రీలంక, న్యూజిల్యాండ్‌లతో 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లు, ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల్లో దాదాపు సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌ల్లో భారత్ గెలవాలి. అప్పుడే భారత్ డబ్ల్యూటీసీ టాప్2లోకి చేరే అవకాశం ఉంటుంది. స్టాటిస్టికల్‌గా మాట్లాడుకుంటే.. మొత్తం 10 మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిస్తే.. 79.63 పాయింట్లు, ఒక మ్యాచ్‌లో ఓడిపోయి 9 మ్యాచ్‌ల్లోనే గెలిస్తే.. 74.07 పాయింట్లతో దర్జాగా టాప్2లోకి చేరుకుంటాం. అదే 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయి 8 మ్యాచ్‌ల్లో గెలిస్తే.. 68.52 శాతం పాయింట్లతో అతి కష్టం మీద టాప్2కి క్వాలిఫై అవుతాం. ఇక 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయామంటే మనం టాప్2 చేరడం అసాధ్యమే. ఎందుకంటే.. 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. 7 మ్యాచ్‌ల్లోనే గెలిస్తే.. మన పాయింట్లు 62.96 పర్సెంట్ పాయంట్లు మాత్రమే సాధిస్తాం. టాప్2లో అడుగుపెట్టాలంటే అది సరిపోదు. అంటే ఫైనల్ ఆడాలంటే.. ఎట్టిపరిస్థితుల్లోనూ అప్‌కమింగ్ 10 మ్యాచ్‌ల్లో టీమిండియా ఎట్టిపరిస్థితుల్లో 2 మ్యాచ్‌లకు మించి ఓడిపోకూడదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 100 పర్సెంట్ పాయింట్స్‌తో టాప్ ప్లేస్‌లో ఉంటే.. సౌతాఫ్రికా 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 66.67 పాయింట్స్‌తో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఇక శ్రీలంక కూడా 2 మ్యాచ్‌ల్లో 1 గెలిచి 66.67 పాయింట్స్‌తో మూడో ప్లేస్‌లో ఉంది.