WTC Final Aiden Markram Temba Bavuma | గెలుపుకు 69 రన్స్ దూరంలో సఫారీలు
ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికా గెలుపుకు చాలా దెగ్గరలో ఉంది. చేతిలో 8 వికెట్లు, ఇంకా 69 పరుగులు చేస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 నాలుగో రోజు తొలి సెషన్‌లోనే గెలిచే ఛాన్స్ కూడా ఉంది.
ఆస్ట్రేలియాపై 282 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ మొదలు పెట్టింది సౌత్ ఆఫ్రికా. 35 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. కొద్దిసేపటికే వియాన్ మల్డర్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాతే ఆట మొదలయింది. ఐడెన్ మార్క్రమ్, కెప్టెన్ బవుమాలు స్కోర్ బోర్డు ని పరిగెత్తించారు. అందిన బాల్స్ ని బౌండరీలకి చేరుస్తు, సింగిల్స్ తీస్తూ టార్గెట్ స్కోర్ ని తగ్గించుకుంటూ వచ్చారు.
మిట్చెల్ స్టార్క్, హేజాల్ వుడ్, కమ్మిన్స్ వంటి స్ట్రాంగ్ పేస్ బౌలింగ్ లో కూడా ఎక్కడా తగ్గకుండా బాటింగ్ చేసాడు ఐడెన్ మార్క్రమ్.
ఈ క్రమంలో మార్క్రమ్ సెంచరీ కూడా అయిపోయింది. బవుమా హార్డ్ సెంచరీ చేసాడు. ఇంకో 69 పరుగులు చేస్తే డబ్ల్యూటీసీ ట్రోఫీ దక్షిణాఫ్రికా సొంతం అవుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్రొటీస్ దీన్ని ఈజీగా చేస్ చేయగలదు. ఆసీస్ గెలవాలంటే 8 వికెట్స్ తీయాలి. 69 పరుగులు, 2 రోజుల గేమ్ మిగిలి ఉంది.