WTC Final AUS vs SA | అద్భుతాలు జరగకపోతే సఫారీలదే ఛాంపియన్ షిప్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌లో సౌతాఫ్రికా ఓపెనర్ ఎయిడెన్ మార్కరమ్ కేప్టన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ పై సెంచరీ చేసి అదరగొట్టాడు. బలమైన ఆస్ట్రేలియ పేస్ ఎటాక్ ని ఎదురించి సెంచరీతో చెలరేగాడు. ప్రొటీస్ కెప్టెన్ టెంబ బవుమా కూడా హాఫ్ సెంచరీ చేసాడు. తమ టీంకి రన్స్ కావాల్సిన టైంలో ఇద్దరు కలిసి పరుగులు సాధించారు. దాంతో వరుసగా రెండో సారి ఛాంపియన్ షిప్ గెలవాలని అనుకున్న ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు పడ్డాయి. నిజం చెప్పాలంటే సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ ఫైనల్ గెలుపుకు అతి చేరువలో ఉంది. 69 పరుగులు చేస్తే చాలు సౌతాఫ్రికాకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ పేరు వచ్చేస్తుంది. సఫారీలకు ఇంకా 8 వికెట్లు ఉన్నాయి, రెండు రోజుల ఆట కూడా మిగిలి ఉంది. ఇలా చూసుకుంటే WTC 2025 ఛాంపియన్ గా సఫారీలు గెలిచే ఛాన్స్ ఉంది.
మ్యాచ్ సఫారీల చేయిజారిపోతుందని అనుకున్న టైంలో వియాన్ మల్డర్ తో కలిసి ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న మర్క్రమ్.. చూడ చక్కని బౌండరీలు సాధిస్తూ, స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. దీంతో ఆసీస్ బౌలర్లు కాస్త ఒత్తిడిలో పడిపోయారు. దీంతో టార్గెట్ కూడా తక్కువ అవుతూ వచ్చింది. బౌలింగ్ లో స్టార్క్ కే రెండు వికెట్లు దక్కాయి.
ఆస్ట్రేలియా WTC ఫైనల్ గెలవాలి అంటే ఎదో ఒక అద్భుతం జరగాల్సిందే అని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. సౌత్ ఆఫ్రికా టీం ఇలాగె తమ ఇన్నింగ్స్ ని కొనసాగిస్తే 4వ రోజే విజేత ఎవరు అనేది తేలిపోతుంది.