WPL 2026 Champion Royal Challengers Bengaluru | రెండోసారి టైటిల్ కైవసం చేసుకున్న ఆర్సీబీ

మహిళా ప్రీమియర్ లీగ్ ( Women's Premier League ) 2026 సీజన్ ముగిసింది. ఈ హై-వోల్టేజ్ ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి, మహిళల ప్రీమియర్ లీగ్‌లో రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. 

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. 4 వికెట్లు కోల్పోయి భారీ స్కోరును చేసింది. ఫైనల్ ఒత్తిడిని ఏమాత్రం లెక్కచేయకుండా మొదటి నుంచే బౌలర్లపై విరుచుకుపడింది. బెంగళూరు బౌలర్లు కొన్ని వికెట్లు తీసి కట్టడి చేసినప్పటికీ, ఢిల్లీ బ్యాటర్ల ధాటికి స్కోరు బోర్డు పరుగులు తీసింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. కెప్టెన్ స్మృతి మంధాన ( Smriti Mandhana ) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. మంధాన కేవలం 87 పరుగులు చేసి జట్టును విజయపు ముంగిట నిలిపారు. ఆమెకు తోడుగా జార్జియా వేర్‌హామ్ ( Georgia Wareham ), ఇతర బ్యాటర్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. వరుసగా నాలుగు సీజన్లలోనూ ఫైనల్ చేరిన ఏకైక జట్టుగా ఢిల్లీ రికార్డు సృష్టించింది. కానీ, ఆడిన నాలుగు ఫైనల్స్‌లోనూ ఓటమి పాలై రన్నరప్‌కే పరిమితమైంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola