Dhoni's sensational comments on Kohli-Rohit | కోహ్లీ–రోహిత్ పై ధోని సంచలన వ్యాఖ్యలు

Continues below advertisement

క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకటే చర్చ.. 2027 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ప్లేయర్స్ రోహిత్ శర్మ ( Rohit Sharma ), విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఆడతారా? లేదా? అని.  ఇప్పటికే కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ), సెలెక్టర్ అజిత్ అగార్కర్ ( Ajit Agarkar ) ఈ విషయంపైన చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. 

ప్రపంచకప్‌లో వాళ్లు ఎందుకు ఆడకూడదు? అని అన్నాడు ధోని. "నాకు వయసు ఎప్పుడూ ఒక సమస్యగా అనిపించలేదు. కేవలం ఫిట్‌నెస్, ఫామ్ మాత్రమే చాలా ఇంపార్టెంట్ అని ధోనీ ( MS Dhoni ) అన్నారు. 22 ఏళ్ల కుర్రాడు అన్‌ఫిట్‌గా ఉన్నా జట్టుకు భారమేనని, అదే సమయంలో 35 లేదా 38 ఏళ్ల ఆటగాడు అద్భుతమైన ఫామ్‌లో ఉంటే వారిని తప్పించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం అనేది రాత్రికి రాత్రే రాదని ధోనీ గుర్తుచేశారు. "16-17 ఏళ్ల పాటు దేశం కోసం ఆడిన ఆటగాళ్ల అనుభవం జట్టుకు ఎంతో అవసరం. కేవలం 20-25 మ్యాచ్‌లు ఆడిన యువకుడికి ఆ పరిణతి రాదు" అని సీనియర్ల ప్రాముఖ్యతను వివరించారు. తాను కూడా 39 ఏళ్ల వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, రోహిత్, విరాట్ తమ ప్రదర్శనను కొనసాగిస్తే జట్టులో ఉండటంలో తప్పులేదన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola