World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే

Continues below advertisement

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ పై టీమ్ ఇండియా ఆశలు పెట్టుకునే పరిస్థితి కూడా ఇప్పుడు కనిపించడం లేదు. డబ్ల్యూటీసీ హిస్టరీలో వరుసగా రెండు సార్లు ఫైనల్‌కు చేరుకున్న భారత్... న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. మూడో సీజన్‌లో బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో ఓటమిపాలయ్యి అర్హత సాధించలేకపోయింది. గౌతమ్ గంభీర్ కోచ్ గా ఎలాగైనా ఈ సారి టైటిల్ సొంత చేసుకుంటాం అన్ని అందరు అనుకున్నారు. టైటిల్ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు అర్హత సాధించడం కూడా కస్టమే. 

సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ లో టీమ్ ఇండియా వైట్ వాష్ అవడంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల టేబుల్‌లో కిందకు దిగజారింది. టాప్ - 3లో కనిపించే టీమిండియా ఈ సారి ఏకంగా పాకిస్తాన్ కంటే కిందకు అంటే.. ఐదవ స్థానానికి పడిపోయింది. 

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్ లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా సౌతాఫ్రికా రెండో స్థానంలో కొనసాగుతుంది. రెండు టెస్టులు ఆడి ఒకదాంట్లో గెలిచి మూడో స్థానంలో నిలిచింది శ్రీలంక.

పాకిస్తాన్ నాలుగులో ప్లేస్ లో ఉండగా, భారత్ తొమ్మిది టెస్టులు ఆడి నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో ఐదో స్థానానికి పడిపోయింది. ఇలా చూస్తే మాత్రం టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు సెలెక్ట్ అవ్వడం కష్టంగానే కనిపిస్తుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola