Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో హిట్‌మ్యాన్
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్స్ లో మళ్లీ మొదటి ప్లేస్ కు చేరుకున్నాడు. 781 పాయింట్స్ తో అగ్రస్థానంలో నిలిచాడు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్ 766 పాయింట్స్ తో రెండో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ లో చివరి రెండు వన్డేల్లో మిచెల్ ఆడలేదు. దాంతో రేటింగ్ పాయింట్లను కోల్పోయ్యాడు. అయితే సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ తో రోహిత్ మళ్ళి టీమ్ లోకి వస్తాడు. ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ మంచి ప్రదర్శన కనబర్చాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ వైట్ వాష్ తర్వాత రోహిత్ శర్మ ఇలా మళ్లీ ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానానికి రావడంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. విరాట్ కోహ్లీ - రోహిత్ శర్మ కాంబినేషన్ లో వన్డే సిరీస్ లో ఎలాగైనా విజయం సాధిస్తామని అందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక టెస్ట్ లో ఆల్‌రౌండర్ లిస్ట్ లో రవీంద్ర జడేజా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.