World Boxing Cup Finals 2025 | 20 పతకాలు సాధించిన ఇండియన్ ప్లేయర్స్
ప్రముఖ బాక్సర్, తెలంగాణ యువతి నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ ఫైనల్స్ టోర్నీలో పసిడి పతకంతో దుమ్మురేపింది. అయితే ఈ టోర్నమెంట్ లో తొమ్మిది స్వర్ణాలతో మన బాక్సర్లు చరిత్ర సృష్టించారు. మహిళల 51కిలోల ఫైనల్ పోరులో యువ బాక్సర్ నిఖత్ జరీన్ 5-0 తేడాతో గువో యి జువాన్ పై అద్భుత విజయం సాధించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్..తుదిపోరులో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి నుంచే తనదైన స్టైల్ లో పవర్‌ఫుల్ పంచ్‌లు ఇస్తూ బాగా డామినెటే చేసింది. చైనీస్ తైపీ బాక్సర్‌కు అవకాశమివ్వకుండా రెండవ రౌండ్‌కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఈ నిజామాబాద్ బాక్సర్ నిఖత్ సాధించిన తొలి మెగాటోర్నీ పతకం ఇదే.
తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌తో పాటు జాస్మిన్ లంబోరియా, పర్వీన్, మీనాక్షి, ప్రీతి, అరుంధతి, నుపుర్, పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. సచిన్, హితేశ్ అగ్రస్థానం దక్కించుకున్నారు.