IPL Auction 2026 | ఐపీఎల్ 2026 మినీ వేలం
ఐపీఎల్ 2026 కు ముందు క్రికెట్ ఫ్యాన్స్ ఎన్నో మార్పులు చేర్పులు చూస్తున్నారు. తమకు వద్దు అనుకున్న ప్లేయర్స్ ను అన్ని టీమ్స్ ఇప్పటికే వదిలేశాయి. అయితే ఈ సారి మాత్రం చాలామంది ప్లేయర్స్ ఐపీఎల్ ఆక్షన్ లో అమ్ముడుపోవడం కష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ప్లేయర్స్ ప్రదర్శన ఆధారంగా టీమ్స్ వారిని కొనుగోలు చేస్తాయి. మంచి ప్రదర్శన లేకపోతే రిటెయిన్ కూడా చేసుకోరు. వాళ్లలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్. వీళిద్దరిని పంజాబ్ కింగ్స్ విడుదల చేసింది. పూర్ పెర్ఫార్మన్స్ కారణంగా టీమ్ నుంచి తప్పించింది పంజాబ్. దాంతో మినీ ఆక్షన్ లో మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్ పై ఎవరు ఆసక్తి చూపించపోవచ్చు.
రాజస్థాన్ రాయల్స్ హసరంగాను విడుదుల చేసింది. వెంకటేష్ అయ్యర్ ను 23.75 కోట్లకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ ... ఈసారి రిటైన్ చేసుకోలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లియామ్ లివింగ్‌స్టోన్‌ను కూడా విడుదల చేసింది. గత సీజన్‌లో లివింగ్‌స్టోన్ గ్రౌండ్ కన్నా ఎక్కువ రోజులు డ్రెస్సింగ్ రూమ్ లోనే ఉన్నాడు.
గత సీజన్ తోపాటు ఇతర మ్యాచ్ ల పెర్ఫార్మన్స్ ఆధారంగానే ఫ్రాంచైజిలు ఏ ప్లేయర్ ను అయినా కొనేందుకు ఆసక్తి చూపిస్తాయి. మరి ఈ ప్లేయర్స్ ను ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా మ్ముడుపోకుండానే ఉండిపోతారు చూద్దాం.