Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ

Continues below advertisement

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ మొదలు కానుంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు అదే జోష్‌తో టీ20 ప్రపంచకప్‌లో అడుగుపెడుతోంది. మన టీమ్ పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. 

ఇటీవల ఇంగ్లండ్, సౌతాఫ్రికాల చేతిలో సిరీస్ ఓటములు, మిడిలార్డర్ వైఫల్యాలు టీమిండియాను కొంత కలవరపెడుతున్నా.. వార్మప్ మ్యాచ్‌ల ప్రదర్శన మాత్రం మారింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఫామ్‌లోకి రాగా, యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్ మంచి టచ్‌లో ఉన్నారు. ఫినిషర్‌గా రిచా ఘోష్ పాత్ర కీలకం కానుంది. 

ఇక ఇంగ్లండ్ పిచ్‌లపై భారత్ స్పిన్ ఎటాక్ తో ముందుకు వెళ్లనుంది. బౌలర్లు దీప్తి శర్మ, శ్రీ చరణి రూపంలో భారత్‌కు మంచి స్పిన్ విభాగం ఉంది. జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌తో భారత్ తన ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది. మరి ఈసారి మన అమ్మాయిలు కప్ ముద్దాడుతారో లేదో చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola