Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?

Continues below advertisement

టీమిండియాలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై సీనియర్ ప్లేయర్స్ బీసీసీఐ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే సీనియర్లతో కోల్డ్ వార్ నడుస్తోందనే ప్రచారం నడుస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇప్పటికే టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీనికి గంభీరే కారణమనే టాక్ వినిపిస్తోంది. 

అయితే, 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా రోహిత్, కోహ్లీ ముందుకు సాగుతుండగా.. హెడ్‌కోచ్‌ గంభీర్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాత్రం వారి స్థానాలపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. వరల్డ్‌ కప్‌ ఆడే విషయంలో రోహిత్, కోహ్లీలకు తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్‌ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాడు. దీనికి విరాట్ కోహ్లీ కూడా గట్టి కౌంటర్‌ ఇస్తూ తనను తాను నిరూపించుకోవాలని పదే పదే ఒత్తిడి చేస్తే, అందుకు తాను తలవంచనని స్పష్టం చేశాడు. 

ఈ నేపథ్యంలో సీనియర్‌ ఆటగాళ్లు గంభీర్‌, అగార్కర్‌లను కాదని బీసీసీఐ ఉన్నతాధికారులతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఎంతో కాలం నుంచి టీమ్ లో ఉన్న సీనియర్లు రానున్న రోజులో టీమ్ లో తమ పాత్ర ఏంటన్న అంశంపై గంభీర్‌తో కాకుండా, నేరుగా బీసీసీఐ ఉన్నతాధికారులతోనే చర్చలు జరుపుతూ తమ ఫ్యూచర్ పై స్పష్టత కోరుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola