ప్రధాని మోదీకి మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విమెన్స్ టీమ్
విమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి వరల్డ్ కప్ చరిత్రలో ఫస్ట్ టైంలో టీమిండియా ప్రపంచ విజేతగా నిలిచింది. దీంతో ఆదివారం నుంచి టీమిండయా విమెన్స్ టీమ్‌తో పాటు దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. ఈ సంబరాల్లో భాగంగానే ఇండియన్స్ విమెన్స్ టీమ్ బుధవారం నాడు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని కలిసింది. న్యూఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న పీఎం నివాసంలో జరిగిన ఈ మీటింగ్ తర్వాత.. టీమిండియా మెంబర్స్ అంతా కలిసి.. మోదీకి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు.
వరల్డ్ కప్ గెలిచిన గుర్తుగా.. నమో నేమ్‌తో నెంబర్ 1 సంఖ్యతో ఉన్న టీమిండియా జెర్సీపై టీమ్ సభ్యులంతా సంతకాలు చేసి.. ఆ జెర్సీని మోదీకి బహుమతిగా ఇచ్చారు. 2017లో ఇంగ్లండ్ చేతిలో ఓడి వన్డే వరల్డ్ కప్ పోగొట్టుకున్న తర్వాత.. ప్రధానికి కలిసిన విషయాన్ని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ గుర్తు చేసుకుంది. వరల్డ్ కప్ పోగొట్టుకుని బాధలో ఉన్న టీమ్‌కి మోదీ ఎంతో స్పూర్తినిచ్చారంది. ఆయనిచ్చిన మోటివేషన్‌తోనే తమలో మరింత కసి పెరిగి.. పట్టుదలగా పోరాడి ప్రపంచకప్ గెలిచామంటూ టీమ్ మెంబర్స్ చెప్పారు.
ఇక మోదీ కూడా.. మహిళల టీమ్‌ని అభినందించడమే కాకుండా.. 52 సంవత్సరాల మహిళా క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా ట్రోఫీని గెలుచుకున్నందుకు హర్మన్‌ప్రీత్ సేనని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అప్రీషియేట్ చేశారు. దేశం గర్వపడేలా ఆడారని, భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఈ విజయం ఓ మైలు రాయిగా నిలిచిపోవడమే కాకుండా.. ఈ విజయం భారత మహిళా క్రికెట్‌కి భవిష్యత్తుని మరింత పటిష్టం చేసిందన్నారు.