సూపర్ స్టార్ హర్షిత్ రానా.. టీమ్‌లో లేకపోవటం ఏంటి గంభీర్ సార్..?

Continues below advertisement

గౌతమ్ గంభీర్ ప్రియతమ శిష్యుడు.. అన్ని ఫార్మాట్లలో ఆడే వన్ అండ్ ఓన్లీ టీమిండియన్ ఆల్‌రౌండర్.. సింగిల్ రికార్డూ సాధించకపోయినా టీమ్‌లో నాన్ స్టాప్‌గా ప్లేస్ కొట్టేస్తున్న వన్ అండ్ ఓన్లీ స్టార్ ప్లేయర్ హర్షిత్ రాణాని పక్కన పెడతారా? టీమిండియా మెనేజ్‌‌మెంట్‌కి ఎంత ధైర్యం? గంభీరన్నా.. ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా?’ ఆసీస్‌తో మూడో టీ20 ఆడిన టీమిండియా స్క్వాడ్‌లో హర్షిత్ రాణా లేకపోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్ ఇవి.

అయితే గంభీర్ టీమిండియా కోచ్ అయినప్పటి నుంచి హర్షిత్ రాణాకు టీమిండియాలో వరుసగా అవకాశాలు వస్తున్న విషయం తెలిసిందే. మొదట టెస్ట్ స్క్వాడ్‌లో ఆ తర్వాత వన్డే స్క్వాడ్‌లో.. చివరిగా ఇప్పుడు టీ20 స్క్వాడ్‌లో ఫుల్‌ఫ్లెడ్జ్డ్ ప్లేయర్ అయిపోయాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. అన్ని ఫార్మాట్లలోకి దర్జాగా డెబ్యూ చేసినా కూడా ఇప్పటివరకు మన సూపర్ స్టార్ ఆల్‌రౌండర్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆహా అనే పెర్ఫార్మెన్స్ ఒక్కటీ చేసింది లేదు. పేరుకు ఆల్‌రౌండరే కానీ.. మొత్తంగా ఇప్పటివరకు 2 టెస్ట్ మ్యాచ్‌లు, 8 వన్డేలు, 5 టీ20లు ఆడినా.. కూడా రీసెంట్‌గా జరిగిన ఆసీస్‌తో 2వ టీ20లో కొట్టిన 35 రన్సే మనోడికి అన్ని ఫార్మాట్లలోనూ హయ్యస్ట్ స్కోర్.

ఇక మన రాణా సాబ్ ఏ రేంజ్ స్టార్ బ్యాటరో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంత అద్భుతమైన బ్యాటర్ కాబట్టే.. హర్షిత్ రాణాని టీమిండియాకి సెలక్ట్ చేసినప్పటి నుంచి క్రికెట్ ఫ్యాన్స్ కోచ్ గంభీర్‌ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆసీస్‌తో ఫస్ట్ టీ20 మ్యాచ్‌లో 35 రన్స్ కొట్టి సెకండ్ హయ్యస్ట్‌ స్కోరర్‌గా నిలిచినా కూడా.. రెండో టీ20 ఆడే ప్లేయింగ్ 11లో సెలక్ట్ చేయలేదు. దీంతో ఫ్యాన్స్ మళ్లీ గంభీర్‌ని ట్రోల్ చేయడం మొదలెట్టారు. మా రాణా అన్న.. సూపర్ స్టార్ ఆల్ రౌండర్‌.. అలాంటి ప్లేయర్‌ని పక్కన పెడతారా..? రాణా లేకపోతే టీమ్‌కి ఎంత నష్టమో మీకు అర్థమవుతోందా? వెంటనే టీమ్‌లోకి తీసుకుంటారా? లేదా? అంటూ బెదిరింపులకే దిగుతున్నారు. మరి చూడాలి మనోడిని మూడో టీ20లో సెలక్ట్ చేస్తారో లేదో.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola