Women's Kabaddi World Cup | కబడ్డీ వరల్డ్ కప్ ఇండియాదే
గేమ్ తో సంబంధం లేకుండా ప్రపంచ వేదికలపై మన భారత అమ్మాయిలు అదరగొడుతున్నారు. భారత మహిళలు మరో వరల్డ్ కప్ అందుకున్నారు. ఢాకాలో జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో చైనాపై భారత్ విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో చైనా తైపేను 35–28 తేడాతో ఓడించి, భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు.
సెమీఫైనల్ లో ఇరాన్‌ను 33–21 తేడాతో ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. మరోవైపు, చైనా తైపే కూడా గ్రూప్ స్టేజ్ లో మ్యాచులను ఓడిపోకుండా ఫైనల్ కు చేరుకుంది. హోరా హోరీగా జరిగిన మ్యాచ్ లో మన అమ్మాయిలు విజయం సాధించారు. ఈ ఘన విజయం సాధించిన భారత మహిళా జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.
భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుతమైన ధైర్యం, నైపుణ్యం, అంకితభావాన్ని ప్రదర్శించిందని ప్రశంసించారు. "ఈ విజయం అనేక మంది యువతులను కబడ్డీ ఆడటానికి ప్రేరేపిస్తుందని, వారిని పెద్ద కలలు కనడానికి, లక్ష్యాలు ఎదుర్కోవడానికి ప్రోత్సహిస్తుందని" ఆయన పేర్కొన్నారు.