India vs South Africa Test Match | కుప్పకూలిన భారత బ్యాట్స్‌మెన్
సౌత్ ఆఫ్రికా ఇండియా మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఏదయితే జరగకూడదని ఫ్యాన్స్ అనుకున్నారో అదే జరుగుతుంది. సొంత గడ్డపై టీమ్ ఇండియా వైట్‌వాష్ అవడానికి దెగ్గరగా ఉంది. బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడంతో టీమ్ ఇండియా ట్రోల్స్ ఎదుర్కుంటుంది.
సౌత్ ఆఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ 48 పరుగులకు 6 వికెట్లు తీశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా మొత్తం ఆధిక్యం 314 పరుగులకు పెరిగింది.
భారత బ్యాటర్ల యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభం అందించినా... ఫలితం లేకుండా పోయింది. కేవలం 13 బంతుల్లోనే సుదర్శన్, జురెల్, పంత్ పెవిలియన్ చేరారు. వాషింగ్టన్ సుందర్.. కుల్దీప్ యాదవ్ కలిసి 62 పరుగులు జోడించారు. మొత్తంగా ఇండియా బ్యాట్సన్ రెండో టెస్టులో కూడా నిరాశపరిచారు. ఈ రెండో టెస్ట్ లో ఇండియా గెలవాలంటే ఎదో ఒక అద్భుతం జరగాల్సిందే.