Karun Nair Crypitc Post Ind vs SA | ట్విట్టర్ వేదికగా కరుణ్ నాయర్ విమర్శలు

Continues below advertisement

గువహటిలో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా బ్యాటింగ్ లైన్ అప్ ఘోరంగా విఫలమైంది. బ్యాటర్ల వైఫల్యం గురించి ప్రస్తావించకుండానే కరుణ్ నాయర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసాడు. తాను తుది జట్టులో ఉండి ఉంటే కథ వేరేలా ఉండేదంటూ.. పరోక్షంగా చెప్పాడు. ఈ మ్యాచ్ ప్రస్తావన తేకుండానే తన మనసులోని మాటను ఒక్క పోస్ట్‌తో చెప్పేశాడు కరుణ్ నాయర్.

“కొన్ని పరిస్థితులు మనసుకు బాగా తెలిసిన అనుభూతిని కలిగిస్తాయి. అలాంటప్పుడు మైదానంలో మనం లేకపోతే మరింత బాధ కలుగుతుంది” అని కరుణ్ నాయర్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు కరుణ్ నాయర్ త్రిబుల్ సెంచరీని గుర్తు చేస్తున్నారు. కరుణ్ నాయర్ ఉండి ఉంటే కథ వేరేలా ఉండేదని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఛాన్స్ ఇచ్చినా ప్రూవ్ చేసుకోలేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. 

అయితే 8 ఏళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన 4 టెస్టుల్లో 205 రన్స్ మాత్రమే స్కోరు చేశాడు. దీంతో అతడిని టెస్ట్ జట్టు నుంచి తప్పించారు సెలక్టర్లు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola