Will Jacks Fielding in RR vs MI IPL 2026 | గాల్లో తేలుతూ విల్ జాక్స్ ఫీల్డింగ్

Continues below advertisement

ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో టఫ్ గా జరిగిందో మనం చూసాం. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిచి ప్లేఆఫ్స్ చేరినప్పటికీ.. ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ చేసిన అద్భుతమైన ఫీల్డింగ్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. బౌండరీ లైన్ దగ్గర విల్ జాక్స్ సూపర్ మ్యాన్‌ లాగా గాల్లోకి ఎగిరి చేసిన ఫీల్డింగ్ చూసి ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. 

అసలు ఏం జరిగిందంటే.. దీపక్ చాహర్ వేసిన మ్యాచ్ తొలి ఓవర్ మూడో బంతికే RR బాట్స్మన్ వైభవ్ సూర్యవంశీ లాఫ్టెడ్ డ్రైవ్‌తో షాట్ ఆడాడు. అది సిక్స్ వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న విల్ జాక్స్ గాల్లోకి ఎగిరి, బాల్ ను లోపలికి నెట్టి ఏకంగా 5 పరుగులు సేవ్ చేశాడు. ఆ సిక్సర్ కాస్తా సింగిల్‌గా మారిపోయింది. దాంతో ఒక్కసారిగా ప్రెజర్‌లోకి వెళ్లిన వైభవ్, భారీ షాట్ ఆడే ప్రయత్నంలో కేవలం 4 పరుగులకే క్యాచ్ అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత జైస్వాల్, కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా తక్కువ రన్స్‌కే అవుట్ అవ్వడంతో రాజస్థాన్ 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజాలు ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరి వల్ల రాజస్థాన్ 20 ఓవర్లలో 205 పరుగుల భారీ స్కోరు సాధించింది.ముంబై 20 ఓవర్లలో 175 పరుగులకే పరిమితమై, 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola