IPL 2026 RCB vs GT Qualifier | SRH ఫ్యాన్స్ ను భయపడుతున్న ప్లేఆఫ్స్ సెంటిమెంట్

Continues below advertisement

మరికొద్ది రోజులో ఐపీఎల్ సీజన్ ముగియనుంది. ప్లేఆఫ్ బర్త్ ను కన్ఫర్మ్ చేసుకోవటానికి ఎన్నో టీమ్స్ కష్టపడ్డా.. ఫైనల్ గా రాజస్థాన్ కు ఆ ఛాన్స్ దక్కింది. పాయింట్స్ టేబుల్ లో టాప్-4లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ గతంలో ఒక్కోసారి టైటిల్ గెలిచినవే. కానీ ఇప్పుడు రెండో ట్రోఫీ ఎవరిదన్నదే అసలు ప్రశ్న. 

అయితే ఐపీఎల్ హిస్టరీ, పాత సెంటిమెంట్లు చూస్తుంటే ఈసారి ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ లో ఎవరో ఒకరికి కప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధర్మశాల వేదికగా జరిగే క్వాలిఫైయర్-1లో ఆర్‌సీబీ, గుజరాత్ తలపడనున్నాయి. గత 15 సీజన్లలో చూసుకుంటే ఏకంగా 14 సార్లు క్వాలిఫైయర్-1 ఆడిన టీమ్స్ విజేతలుగా నిలిచాయి. ఈ లెక్కన చూస్తే ఆర్‌సీబీ, జీటీలకు భారీ అడ్వాంటేజ్ ఉంది.

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లలో ఎవరైనా టైటిల్ గెలవాలంటే వరుసగా మూడు మ్యాచ్‌లు నెగ్గాల్సిందే. ఐపీఎల్ హిస్టరీలోనే ఎలిమినేటర్ ఆడి కప్పు కొట్టిన రికార్డ్ చాలా తక్కువ. 2016లో ఎలిమినేటర్ నుండి వచ్చి కేకేఆర్, గుజరాత్ లయన్స్, ఆర్‌సీబీలను ఓడించి సన్‌రైజర్స్ కప్పు కొట్టింది. మరి ఈసారి హిస్టరీని తిరగరాస్తూ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? లేక ఆర్‌సీబీ, గుజరాత్‌లు సెంటిమెంట్‌ను కాపాడుకుంటాయా? అనేది చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola