Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?

Continues below advertisement

గాయంతో ఇబ్బంది పడుతున్న టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, అఫ్గానిస్థాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ తీవ్రంగా గాయపడ్డాడు. పరుగులు తీయడానికి ఇబ్బంది పడినా ఆఖరి బాల్ వరకు క్రీజ్ లోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్స్ ఎవరా అని ఆసక్తి మొదలయింది. 

ఈ రేస్‌లో వినిపిస్తున్న మొదటి పేరు వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్. ఇప్పటికే అంతర్జాతీయ టీ20ల్లో అదరగొడుతున్న సంజూ, సౌతాఫ్రికాపై వన్డేల్లో సెంచరీ చేసి తన సత్తా చాటాడు. ఐపీఎల్ లో కూడా బాగానే ఆడాడు. ఇక రెండో ఆప్షన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తిలక్ వర్మ. టీ20ల్లో ఇండియా తరఫున రెగ్యులర్ ప్లేయర్‌గా మారిన తిలక్ వర్మ, ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున 359 పరుగులు చేశాడు. 

చివరిగా, ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఆర్‌సీబీని వరుసగా రెండు సార్లు విజేతగా నిలిపిన పాటిదార్, స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొంటాడు. అఫ్గానిస్థాన్ ప్రధాన బలం స్పిన్ కాబట్టి, వారిని దెబ్బతీయడానికి పాటిదార్ సరైనన వాడు అని కూడా అంటున్నారు. మరి ఈ ముగ్గుర్లో ఎవరికీ చోటు దక్కుతుందో చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola