Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్ సెట్‌పై పరిశోధన
సాధారణంగా ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల స్టోరీస్, సక్సెస్‌ఫుల్ స్టార్టప్‌లపై కేస్ స్టడీలు జరుగుతుంటాయి. కానీ చరిత్రలో మొదటిసారి ఒక 15 ఏళ్ల కుర్రాడి ప్రయాణం, అతని మైండ్‌సెట్ నిపుణుల దృష్టిని ఆకర్షించింది. అతనే రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ!
ఈ యువ ఆటగాడిపై ఐఐఎం ఇండోర్ ప్రత్యేకంగా పరిశోధన చేపట్టింది. ఈ స్టడీకి వైభవ్ సూర్యవంశీ: మైండ్‌సెట్ అండ్ మేనేజ్‌మెంట్ అని పేరు పెట్టారు. గ్రౌండ్ లో వైభవ్ ప్రదర్శించే బ్యాటింగ్ స్కిల్స్ మాత్రమే కాకుండా అంత చిన్న వయసులో అతని మెంటల్ స్ట్రెంగ్త్, మెచూరిటీ, ప్రెషర్ తట్టుకునే విధానం పై ఈ రీసెర్చ్ జరగనుంది.
గత ఐపీఎల్ సీజన్ లో వైభవ్ సృష్టించిన రికార్డులు చూస్తే ఎవరైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కేవలం 17 మ్యాచ్‌లలోనే 700 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఒకే సీజన్‌లో ఏకంగా 72 సిక్సర్లు కొట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పవర్‌ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపించి, అతి చిన్న వయసులోనే ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు.