Who is Raj Bawa : ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రాజ్ బవా కోసం నెటిజన్ల సెర్చింగ్ | ABP Desam
అండర్ 19 వరల్డ్ కప్ లో 162 పరుగులు బాది ఎప్పుడో శిఖర్ దవన్ క్రియేట్ చేసిన రికార్డులను బద్ధలు కొట్టిన రాజ్ బవా వివరాల కోసం నెటిజన్లు వెతికేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ కి చెందిన ఈ ఆల్ రౌండర్....తండ్రి క్రికెట్ కోచ్ కావటంతో ఈ ఆటవైపు అడుగులు వేశాడు. అంతే కాదు రాజ్ బవా తాతయ్య కు ఓ ఘనమైన రికార్డు ఉంది. 1948 ఒలింపిక్స్ లో పసిడి పతకం నెగ్గిన హాకీ జట్టులో రాజ్ బవా తాతయ్య తార్ లోచన్ బవా సభ్యుడు. హాకీ క్రీడాకారుడిగా విశ్వవేదికపై మెరిశాడాయన. ఆయన పేరును నిలబెడుతూ....రాజ్ బవా అండర్ 19 వరల్డ్ కప్ లో భారత్ తరపున తనపేరిట ఓ రికార్డు క్రియేట్ చేసి వార్తల్లోకెక్కాడు.