IPL 2022 Venue : ఆ రెండు నగరాల్లోనే సీజన్ మొత్తం మ్యాచ్ లు | Cricket | India | ABP Desam

IPL 2022 సీజన్... భారత్ లోనే జరుగుతుందని BCCI అధ్యక్షుడు Sourav Ganguly తెలిపారు. మార్చి చివరి వారం నుంచే లీగ్ మ్యాచ్ లు మొదలవనున్నాయి. అయితే పది జట్లు పది నగరాల్లో హోం మ్యాచ్ లు ఆడేలా కాకుండా... సీజన్ మొత్తం 3-4 స్టేడియాల్లోనే జరిగే అవకాశముంది. ముంబయిలోని వాంఖడే, సీసీఐ, డీవై పాటిల్ స్టేడియాలతో పాటు అవసరమైతే పుణెనూ తీసుకోనున్నారు. ఈ నాలుగు స్టేడియాల్లో నిర్వహిస్తే.... విమాన ప్రయాణ అవసరం లేకుండా రోడ్డు మార్గంలోనే వెళ్లి రావొచ్చు. దాంతో కొవిడ్ నియంత్రణ సులువు అవుతుందని BCCI భావిస్తోంది. ఈ ప్రాంతాల్లో అన్ని జట్లకు సరిపడే సంఖ్యలో హోటళ్లూ ఉన్నాయని, అందుకే ఇక్కడే నిర్వహిస్తే బాగుంటుందని యోచిస్తోంది. వచ్చే నెల 12,13 తేేదీల్లో మెగా ఆక్షన్ బెంగళూరులోనే జరగనుందని, ఎలాంటి మార్పూ లేదని తెలిపింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola