Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ

Continues below advertisement

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే మూడు ఫార్మాట్లలో 900 కంటే ఎక్కువ ఐసీసీ రేటింగ్ పాయింట్లు సాధించిన ఏకైక బ్యాటర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ల్లో 937, వన్డేల్లో 911, టీ20ల్లో 909 రేటింగ్ పాయింట్లను కోహ్లీ తన కెరీర్ బెస్ట్‌గా అందుకున్నాడు.

ప్రపంచ క్రికెట్‌లో మరే ఆటగాడికి కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. భారత్ తరఫున ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 900 రేటింగ్ పాయింట్లు దాటిన వారిలో సునీల్ గవాస్కర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మాత్రమే ఉన్నారు. చివరికి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా తమ కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో ఈ ఫీట్ సయించలేదు. 

ఇప్పటికే అంతర్జాతీయ టీ20లు, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ, ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు అర్ధ సెంచరీలతో అద్భుత ఫామ్‌ను చాటుకున్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola