Virat Kohli Tweet | India vs Australia | విరాట్ కోహ్లీ సంచలన ట్వీట్

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ కోసం సిద్ధమవుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. కోహ్లీ పెట్టిన ఈ ట్వీట్ తో 2027 వన్డే ప్రపంచకప్ పై మరోసారి చర్చ మొదలయింది. 

‘ఎప్పుడైతే ప్రయత్నించడం వదిలేస్తావో.. అప్పుడు నువ్వు నిజంగా ఫెయిల్ అయినట్టు’ అంటూ ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఈ ఒక మెసేజ్ తో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ పై క్లారిటీ ఇచ్చారని ఫ్యాన్స్ అంటున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్‌లో తాను ఆడబోతున్నట్టుగా క్లారిటీ ఇచ్చాడని కూడా అంటున్నారు. 

ఆస్ట్రేలియా వన్డే సిరీస్ తర్వాత విరాట్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారని చాలాకాలంగా అనుకుంటున్నారు. కానీ ఈ విషయంపై వీళ్లిద్దరు ఎక్కడా స్పందించలేదు. బీసీసీఐ కూడా చేపి చెప్పనట్టుగా స్పందిస్తుంది. ఇలాంటి టైం లో విరాట్ కోహ్లీ ఈ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది. మరి ఈ ట్వీట్ కి సరైన అర్థం ఏంటనేది విరాట్ కోహ్లీనే ఫ్యాన్స్ కు క్లారిటీ ఇవ్వాలి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola