India vs Australia ODI | Virat Records | ఆస్ట్రేలియా టూర్‌లో విరాట్ సచిన్‌ను అధిగమిస్తాడా ?
స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి వన్డే క్రికెట్‌లో మంచి రికార్డ్ ఉంది. విరాట్ దాదాపు 7 నెలల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆడుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో విరాట్ కోసం 4 రికార్డులు ఎదురు చూస్తున్నాయి.
విరాట్ ఇప్పటివరకు వన్డేల్లో 14,181 పరుగులు చేశాడు. 14,234 పరుగులు చేసి సంగాకర మొదటి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇంకా 54 పరుగులు చేస్తే సంగాకర రికార్డ్ ను బ్రేక్ చేస్తాడు. విరాట్ కోహ్లీ వన్డే మ్యాచ్‌లలో 1,484 ఫోర్లు కొట్టాడు. ఇంకో 16 ఫోర్లు కొడితే 1,500 మార్క్ ను చేరుకొని... ఒక ప్రత్యేకమైన రికార్డును తన పేరుపై నమోదు చేసుకోవచ్చు.
ఈ టూర్ లో విరాట్ సెంచరీతో చెలరేగితే ... ఒక ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డును బద్దలు కొడతారు. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్... వీళ్లిద్దరు కూడా వన్ డే ఫార్మాట్‌లో 51 సెంచరీలు సాధించారు. ఇంకా ఒక సెంచరీ సాధిస్తే .... విరాట్ కోహ్లీ వన్ డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డును బద్దలు కొట్టి సచిన్ టెండూల్కర్‌ను అధిగమిస్తాడు.
విరాట్ ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడాడు, ఇందులో 802 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో 1000 వన్డే పరుగులు పూర్తి చేయడానికి విరాట్‌కు 198 పరుగులు అవసరం. ఈ వన్డే సిరీస్‌లో విరాట్ ఖచ్చితంగా ఈ రికార్డ్స్ అని బ్రేక్ చేస్తాడని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.