పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి
కింగ్ విరాట్ కోహ్లీ నిద్ర లేచాడు. ఈ మాట కొంచెం హార్ష్ గా ఉన్నా తప్పదు. కోహ్లీ సెంచరీ కొట్టి ఏడాదిన్నరయ్యింది. 16ఇన్నింగ్స్ లు వేచి చూశాడు విరాట్. 2023 మార్చిలో వెస్టిండీస్ లో చేరిన సెంచరీనే చివరిది. ఈ రోజు పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కింగ్ తిరిగి ఫామ్ ను అందుకున్నాడు. సూపర్ సెంచరీతో టీమిండియాను (Perth Test) ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే స్టేజ్ కు తీసుకువెళ్లాడు. యశస్వి జైశ్వాల్ 161 అద్భుత ఇన్నింగ్స్ ఆడి అవుటైన తర్వాత గేర్లు మార్చిన కోహ్లీ వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి తోడుగా (India Vs Australia Test Match) భారత్ ఆధిక్యాన్ని 500 పరుగులు దాటించాడు. 143 బంతుల్లో 8ఫోర్లు, 2 సిక్సులతో సరిగ్గా సెంచరీ కొట్టాడు విరాట్. కింగ్ కొహ్లీకి ఇది ఓవరాల్ గా 80వ శతకం. టెస్టుల్లో 30వ సెంచరీ. కొహ్లీకి తోడుగా చివర్లో నితీశ్ రెడ్డి దూకుడుతో టీమిండియా 534పరుగుల టార్గెట్ ఇచ్చింది.