Virat Kohli On Retirement | తొలిసారి రిటైర్మెంట్ పై మాట్లాడిన విరాట్ కొహ్లీ | ABP Desam
విరాట్ కొహ్లీ ఈ ఏడాది ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకూ 13మ్యాచులు ఆడిన 661 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ ఆల్మోస్ట్ సీజన్ అంతా కొహ్లీ దగ్గరే ఉంది. ఈ సీజన్ లో 155 స్ట్రైక్ రేట్ తో ఓ సెంచరీ ఐదు హాఫ్ సెంచరీలు బాదాడు కింగ్. ఎన్న డూ లేని విధంగా ఈ సీజన్ లో కొహ్లీ 33 సిక్సులు కొట్టాడు. ఇంత భయంకరమైన స్టాట్స్ కనిపిస్తున్నా కొహ్లీని సీనియర్లు వదిలిపెట్టడం లేదు. ప్రత్యేకించి సునీల్ గవాస్కర్ లాంటి లెజెండ్స్ కొహ్లీ ఆడుతున్న తీరును తప్పుపడుతున్నారు. కొహ్లీ మ్యాచ్ గెలవటం కంటే తన పర్సనల్ రికార్డులపైనే దృష్టి పెడుతున్నట్లు ఉందని..అందుకే స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంటోదంటూ ఈ ఐపీఎల్ లో చాలా సార్లు అన్నాడు. దానికి కొహ్లీ కూడా అగ్రెసివ్ గా రిప్లై ఇచ్చాడు చాలా సార్లు. అయితే నిన్న ఆర్సీబీ రాయల్ గాలా డిన్నర్ ఈవెంట్ జరిగింది. అందులో పాల్గొన్న కింగ్ ఫస్ట్ టైమ్ తన రిటైర్మెంట్ మీద మాట్లాడాడు. నా సీన్ అయిపోయిందని నాకు అనిపిస్తే నేను వెళ్లిపోతాను. ఆ తర్వాత ఇంకెవ్వరికీ కనిపించను కూడా. ఎల్లకాలం ఇలాగే ఆడతానని పొగరు లేదు. బట్ ఆడినంత కాలం నా బెస్ట్ ఇవ్వాలనే అనుకుంటాను. అందుకే ఇంతకాలంగా ఆడగలుగుతున్నాను. ఒక్కసారి ఇదంతా వద్దు అనిపిస్తే మళ్లీ ఎవ్వరికీ కనపడను కూడా కనపడను అంటూ కొంచెం ఎమోషనల్ గా మాట్లాడాడు. 35సంవత్సరాల ఏజ్ లో ప్రతీ సిరీస్ లోనూ తన బెస్ట్ ఇచ్చేందుకు కొహ్లీ ప్రయత్నిస్తున్నా సీనియర్లు సూటిపోటి మాటలు అనటం కొహ్లీ మనసుకు తీసుకున్నాడనైతే అర్థం అవుతోంది. ఈ సీజన్ లో వరుసగా ఐదు మ్యాచులు గెలిచి రేసులోకి వచ్చిన బెంగుళూరు...చెన్నైని ఓఢించి ప్లే ఆఫ్స్ కి వెళితే కొహ్లీ మరింత కాన్ఫిడెంట్ గా నెక్ట్స్ జరగబోయే టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంటుంది.