SRH vs GT Match Highlights | IPL 2024 ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయిన సన్ రైజర్స్ | ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సీజన్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో జోరు చూపించి ప్రత్యర్థులను గజ గజ వణికించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయ్యింది. ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే మిగిలి ఉన్న రెండు మ్యాచుల్లోనూ విరుచుకుపడాలని ఆరెంజ్ ఆర్మీ భావించి నిన్న గుజరాత్ టైటాన్స్ తో తలపడేందుకు సిద్ధమైనా వరుణదేవుడు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. నిన్న హైదరాబాద్ లో కురిసిన వర్షంతో ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. కనీసం 5ఓవర్ల మ్యాచ్ నైనా నిర్వహించేందుకు రాత్రి పదిన్నర గంటలవరకూ ట్రై చేశారు ఔట్ ఫీల్డ్ పూర్తిగా నీటితో నిండిపోవటం..మధ్య మధ్యలో వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉండటంతో రిఫరీ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గుజరాత్ టైటాన్స్ కు ఓ పాయింట్ లభించగా ఆ టీమ్ ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయింది. సన్ రైజర్స్ కూ ఓ పాయింట్ రావటంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 15పాయింట్లు సాధించి ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. సీఎస్కే తప్ప మరే టీమ్ కు 15పాయింట్లు దాటి వచ్చే అవకాశం లేకపోవటం..రెండు బెర్తులు ఖాళీగా ఉండటంతో గణాంకాల ప్రకారం సన్ రైజర్స్ ప్లే ఆఫ్ బెర్తు దక్కించుకుంది. ఇక ఆఖరి మ్యాచ్ పంజాబ్ ను సన్ రైజర్స్ చిత్తు చేస్తే...కేకేఆర్ రాజస్థాన్ ను ఓడిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ 2లో స్థానం దక్కించుకుని ప్లే ఆఫ్స్ ఆడే అవకాశం ఉంటుంది.