SRH Qualified For IPL 2024 Playoffs | కొనసాగుతున్న కెప్టెన్ కమిన్స్ విజయ పరంపర | ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్యాట్ కమిన్స్. ఫ్యాన్స్ అంతా సైలెన్సర్ అని పిలుచుకునే ఆటగాడు. ఎందుకంటే ఆటిట్యూడ్ కంటే ఆటకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చే జెంటిల్మన్ ప్లేయర్. పొగరు చూపిస్తాడు మ్యాచ్ కు ముందు బోల్డ్ స్టేట్మెంట్లు కూడా ఇస్తాడు. లాస్ట్ వరల్డ్ కప్ ఇండియాలో ఆడుతున్నప్పుడు విన్నాం కదా...140కోట్ల మంది భారతీయులు గ్రౌండ్ లో మ్యాచులో లక్ష మంది ప్రేక్షకుల అరుపుల్ని సైలెంట్ చేస్తే ఆ మజానే వేరు అన్నాడు. అన్నట్లుగానే వరల్డ్ కప్ ఫైనల్ టీమిండియా ను ఓడించి కప్పు ఆస్ట్రేలియాకు ఎగురేసుకుపోయాడు. అంతకు ముందు లండన్ లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ అంతే. హాట్ ఫేవరెట్ అనుకున్న టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియాను టెస్ట్ ఛాంపియన్ షిప్ విశ్వవిజేతగా నిలిపాడు. ఇలా తను కెప్టెన్సీ చేసిన రెండు పెద్ద ఈవెంట్లలోనూ ఆస్ట్రేలియాను ఫైనల్ కు తీసుకెళ్లి ప్రత్యర్థి భారత్ ను ఓడించి కంగారూలను విశ్వవిజేతలుగా నిలిపిన ప్యాట్ కమిన్స్..ఇప్పుడు ఇండియాలోనే జరుగుతున్న ఐపీఎల్లోనూ తొలిసారి కెప్టెన్సీ చేసి తనదైన మార్క్ మేజిక్ చూపించాడు.