Virat Kohli Comments On Captaincy Stress | ద్రవిడ్ చేసిన సాయంపై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు

Continues below advertisement

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ నేషనల్ టీమ్ కు కెప్టెన్‌గా వ్యవహరించడం వల్ల తనపై పడిన మానసిక, శారీరక ఒత్తిడి గురించి సంచలన విషయాలను పంచుకున్నాడు. 2021-2022 మధ్యకాలంలో తాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకునే సమయానికి పూర్తిగా అలసిపోయానని.. తనలో శక్తంతా అయిపోయింది అని కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశాడు. 

"నిజం చెప్పాలంటే ఒకానొక దశలో నేను బ్యాటింగ్ యూనిట్‌కు, టీమ్ కు కెప్టెన్ గా ఫోకల్ పాయింట్ అయ్యాను. ఈ రెండు బాధ్యతలు నాపై ఎంత భారాన్ని పెంచుతాయో మొదట గ్రహించలేదు. భారత క్రికెట్‌ను అగ్రస్థానంలో ఉంచాలనే బలమైన కోరిక వల్ల స్ట్రెస్ పట్టించుకోలేదు కానీ.. కెప్టెన్సీ వదిలేసే సమయానికి నాలో మరింతగా ఇవ్వడానికి ఏమీ మిగలలేదు. అవును అది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి" అని పేర్కొన్నాడు. 

ఫార్మ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పుడు తనకు అండగా నిలిచిన మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌లను అభినందించాడు. "2023లో నా టెస్ట్ క్రికెట్ ప్రయాణం అద్భుతంగా సాగింది. ద్రవిడ్ భాయ్, విక్రమ్ రాథోడ్ నన్ను అంతగా చూసుకున్నారు. 'నేను వారి కోసం ఆడాలి, మైదానంలో కష్టపడాలి' అనే భావన నాలో కలిగించారు అని కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola