Hardik Pandya Shocking Comments IPL 2026 | కేకేఆర్ చేతిలో ఓటమిపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఘోర ఓటమి పాలైన తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఓటమికి గల కారణాలను ఒప్పుకున్నాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో తమ జట్టు కనీసం 20 పరుగులు తక్కువ చేసిందని అంగీకరించాడు. పవర్‌ప్లేలోనే వరుసగా వికెట్లు కోల్పోవడం తమ జట్టు ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీసిందని.. అయితే తాను, తిలక్ వర్మ మరికొంత సమయం క్రీజులో ఉండి మంచి భాగస్వామ్యం నెలకొల్పి ఉంటే, మరో 15-20 పరుగులతో మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేదని పాండ్యా పేర్కొన్నాడు.

ఈడెన్ గార్డెన్స్ పిచ్ ప్రవర్తన గురించి మాట్లాడుతూ.. బౌలర్లకు సహకరించే ఇలాంటి వికెట్లపై ఆడటం తనకు చాలా ఇష్టమని హార్దిక్ తెలిపాడు. ప్రస్తుత రోజుల్లో ఐపీఎల్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారిపోతోందని, బౌలర్లు నిస్సహాయంగా ఫీలవుతున్నారని.. కానీ ఈరోజు బౌలర్లకు కూడా పిచ్ నుంచి మంచి సహకారం లభించిందని చెప్పాడు. అందుకే తాను ఈ పిచ్‌పై ఆడటాన్ని ఎంతగానో ఆస్వాదించానని పాండ్యా స్పష్టం చేశాడు.

"మేము ఈ టోర్నీలో చాలా క్యాచ్‌లు వదిలేశాం. ఈ విషయంలో దాచుకోవడానికి ఏమీ లేదు. మ్యాచ్ రెసల్ట్ ను మార్చే క్యాచ్‌లను వదిలేసినప్పుడు వెనుకబడిపోతాం" అని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరగా ఈ సీజన్‌ను ఒక మంచి విజయంతో ముగించాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola