Vamika First Look: కొహ్లీ అర్థ సెంచరీ పూర్తి కాగానే సందడి చేసిన వామిక, అనుష్క| ABP Desam
ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కొహ్లీ హాఫ్ సెంచరీ బాదాడు. 288 పరుగుల లక్ష్య చేధనలో అర్థశతకం కొట్టిన విరాట్...అనంతరం తన సంతోషాన్ని చేతులు ఊపుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. అందుకు కారణం ఉంది తొలిసారి వామిక స్టేడియానికి రావటం..బయటి ప్రపంచానికి చూపించారు. ఇదే సందర్భంలో కొహ్లీ హాఫ్ సెంచరీ కొట్టడంతో తన వల్లే ఇదంతా అనే సంకేతం వచ్చేలా సెలబ్రేట్ చేశాడు కొహ్లీ. ఇక వామిక కు కొహ్లీని చూపిస్తూ అనుష్క తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. పాప పుట్టిన తర్వాత తొలిసారి తను బయటి ప్రపంచానికి కనపడటంతో వామిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.