Ind Vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లోనూ వరుసగా మూడో వన్డేనూ కోల్పోయిన భారత్| ABP Desam
భారత్‌తో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా నాలుగు పరుగులతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను కూడా 3-0తో వైట్ వాష్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌట్ అయింది. భారత వన్డే క్రికెట్ చరిత్రలో సిరీస్ వైట్ వాష్ కావడం ఇది కేవలం మూడో సారి మాత్రమే. కెప్టెన్సీ చేసిన మొదటి మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన మొదటి కెప్టెన్ కూడా కేఎల్ రాహులే.