Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్

Continues below advertisement

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ జింబాంబ్వే తో జరిగిన మొదటి టీ20 లో పరుగుల మోత మోగించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన బ్యాట్ పవర్ ఏంటో చూపిస్తూ విధ్వంసం సృష్టించాడు. 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు.

ఈ ఇన్నింగ్స్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అతి చిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా వైభవ్ చారిత్రాత్మక వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. అంతేకాదు, 16 ఏళ్ల వయసులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 37 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టడం విశేషం. 

మ్యాచ్ తర్వాత మాట్లాడిన వైభవ్.. ఈ ఇన్నింగ్స్ తన కాంఫిడెన్స్ ని పెంచిందని, ఈ రికార్డ్ ఫిఫ్టీని తన కుటుంబం, కోచ్‌లకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. భారత్ 7 వికెట్ల తేడాతో సునాయస విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వేను భారత బౌలర్లు 125 పరుగులకే పరిమితం చేశారు. కేవలం 13.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ ఈ సిరీస్‌లో శుభారంభం చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola