Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
క్రికెట్ లో అత్యంత ప్రెస్టీజియస్ 'యాషెస్' సిరీస్ గురించి క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఒక మైండ్ బ్లాకింగ్ ఐడియాపై వర్క్ చేస్తోంది. భవిష్యత్తులో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగే యాషెస్ టెస్ట్ మ్యాచ్‌ను న్యూట్రల్ వెన్యూగా భారత్‌లో నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్‌బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఏడాది డిసెంబర్‌లో బిగ్ బాష్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్‌ను చెన్నై వేదికగా నిర్వహించే చారిత్రక నిర్ణయం తీసుకున్న CA, ఇప్పుడు యాషెస్ వైపు దృష్టి సారించింది. ఈ విషయాన్ని టాడ్ గ్రీన్‌బర్గ్ మాట్లాడుతూ.. "బీసీసీఐ, ఈసీబీలతో మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. భారత మార్కెట్‌లో టాప్-టైర్ క్రికెట్‌కు ఎంతో క్రేజ్ ఉంది. ప్రస్తుతం షెడ్యూల్, లాజిస్టిక్స్ వల్ల వెంటనే దీన్ని అమలు చేయడం సాధ్యం కాకపోయినా, భవిష్యత్తు కాన్సెప్ట్ కోసం ఈ ఆప్షన్‌ను ఓపెన్‌గానే ఉంచాం" అని తెలిపారు.
అయితే ఈ ప్లాన్‌కు ప్రధాన అడ్డంకి బిజీ క్యాలెండర్ షెడ్యూలే. "గ్లోబల్ క్రికెట్‌లో ఏడాదికి 365 రోజులే ఉండటం అతిపెద్ద సవాలు. మేము అనుకున్న కంటెంట్ ఫిట్ చేయాలంటే ఇంకో రెండు నెలల సమయం అవసరం పడుతుంది" అని ఆయన వివరించారు. ఒకవేళ భవిష్యత్తులో భారత్ వేదికగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల మధ్య యాషెస్ మ్యాచ్ జరిగితే, అది క్రికెట్ చరిత్రలోనే ఒక అతిపెద్ద మైలురాయిగా నిలిచిపోతుంది.