U19Worldcup Finals: ఫైనల్లో ఇంగ్లండ్ ను చిత్తు చేసి ఐదో సారి భారత్ ప్రపంచ కప్ కైవసం| ABP Desam

U19 Worldcup లో అజేయంగా Final కి చేరుకున్న Young Team India బలమైన ప్రత్యర్థి England ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ విసిరిన 190 పరుగుల లక్ష్యాన్ని 47.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి చేధించింది భారత్. చేధనలో తొలుత షేక్ రషీద్ అర్థశతకంతో అదరగొడితే.....చివరి వరకూ నిలిచిన సింధూ అర్థ సెంచరీతో టీమిండియాను గెలిపించాడు. తొలుత మన బౌలర్లు Raj Bawa 5 వికెట్లతో, Ravikumar 4 వికెట్లతో England ను కోలుకోలేని దెబ్బతీశాయి. స్వల్ప స్కోరుకే పరిమితం చేశాయి. మొత్తం మీద భారత్ ఐదోసారి U19 వరల్డ్ కప్ ను ముద్దాడింది. కెప్టెన్లు గా చేసిన కైఫ్, కొహ్లీ, ఉన్ముక్త్ చంద్, పృథ్వీ షాల సరసన యంగ్ స్టర్ యష్ ధుల్ చేరిపోయాడు. మాజీలు, క్రికెట్ విశ్లేషకులు యువభారత్ ను ప్రశంసలతో ముంచెత్తారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola