Tilak Varma Maiden IPL Century | తెలుగు కుర్రాడి సెంచరీ సునామీ

ఐపీఎల్ 2026లో మన తెలుగు స్టార్, ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ చెలరేగిపోయాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ కేవలం 45 బంతుల్లోనే 101 పరుగులు చేసి సెంచరీతో రికార్డు సృష్టించాడు. ముంబై 96 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టైంలో, క్రీజులోకి వచ్చిన తిలక్.. గుజరాత్ బౌలర్లను ఉతికి ఆరేసాడు. 

ఈ ఇన్నింగ్స్‌లో అసలైన ట్విస్ట్ 18వ ఓవర్‌లో మొదలైంది. అశోక్ శర్మ వేసిన ఈ ఓవర్‌లో తిలక్ 6, 4, 4, 6, 6 బాది స్టేడియాన్ని హోరెత్తించాడు. 150 కి.మీ వేగంతో వచ్చిన ఆఖరి బాల్ తిలక్ కు బలంగా తాకింది. దాంతో గ్రౌండ్ లోనే విలవిలలాడాడు. ఆ తర్వాత కూడా నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ కొనసాగించాడు. 

ఎక్కడా తగ్గకుండా 19వ ఓవర్ లో వరుస బౌండరీలతో తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా స్ట్రాటజిక్ టైమ్ ఔట్‌లో కెప్టెన్ హార్దిక్ చెప్పిన మాటలతో  తిలక్ గేర్ మార్చాడు, కేవలం 12 బంతుల్లోనే 50 పరుగులు రాబట్టి సెంచరీ మార్క్ అందుకోవడం విశేషం. ఐదో వికెట్‌కు హార్దిక్‌తో కలిసి 81 పరుగులు జోడించి ముంబైకి 199 పరుగుల భారీ స్కోరు అందించాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola