Ashwani Kumar MI vs GT IPL 2026 | ముంబై క్యాంప్ లో కొత్త డెత్ ఓవర్ స్పెషలిస్ట్

ముంబై ఇండియన్స్ లో కొత్త పేరు మారుమ్రోగిపోతుంది. అతనే యంగ్ పేసర్ అశ్వనీ కుమార్. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో అశ్వనీ తన బౌలింగ్‌తో బ్యాటర్లను వణికించాడు. 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. 

ఈ సీజన్‌లో తనకి దక్కిన ఈ తొలి అవకాశాన్ని అశ్వనీ కుమార్ అద్భుతంగా యూస్ చేసుకున్నాడు. మ్యాచ్ కృషల్ స్టేజ్ లో ఉన్నప్పుడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ యంగ్ ప్లేయర్ పై నమ్మకం ఉంచాడు. అశ్వనీ ఏమాత్రం తడబడకుండా శుభ్‌మన్ గిల్ వికెట్‌తో మొదలుపెట్టి.. రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్ వంటి భారీ హిట్టర్లను పెవిలియన్ చేర్చాడు. 

అశ్వనీ బౌలింగ్‌లో లైన్ అండ్ లెంగ్త్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో యార్కర్లు, స్లోయర్ బాల్స్ తో గుజరాత్ ను భారీ స్కోర్ చేయకుండా ఆపాడు. గత ఏడాది కూడా మంచి ప్రదర్శన ఇచ్చిన అశ్వనీ, ఈసారి మరింత అదే జోరు చూపిస్తాడు. ముంబై ఇండియన్స్ కు మరో బుమ్రా దొరికాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola