Team India Sentiment in T20 Worldcup 2024 | టీ20 కప్ టీమిండియాదే అంటున్న ఫ్యాన్స్ | ABP Desam

భారత్, కెనడా జట్ల మధ్య జరగాల్సిన గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. అయితే టీమిండియా ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా ఏడు పాయింట్లతో గ్రూప్=ఏలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే భారత్, కెనడా మ్యాచ్ రద్దయినా మనకి మంచిదే అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్. 17 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను సెంటిమెంట్‌గా చెబుతున్నారు. 2007లో జరిగిన మొదటి టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుచుకుంది. ఆ టోర్నమెంట్‌లో భారత్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆ తర్వాత మరెప్పుడూ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వలేదు. అలాగే టీమిండియా కప్ కూడా సాధించలేదు. కానీ ఇప్పుడు మ్యాచ్ క్యాన్సిల్ అయింది కాబట్టి కప్ టీమిండియాదే అని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. సూపర్-8లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాలతో తలపడనుంది. మరో మ్యాచ్‌లో ప్రత్యర్థి ఎవరో తెలియాల్సి ఉంది. అది ఇంగ్లండ్ లేదా స్కాట్లాండ్ అయ్యే అవకాశం ఉంది. జూన్ 20న భారత్, ఆఫ్ఘన్ తలపడనున్నాయి. జూన్ 24వ తేదీన భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola