Sunil Gawaskar Furious About Florida | ఫ్లోరిడా స్టేడియంపై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

Continues below advertisement

భారత్, కెనడా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ రద్దవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు వర్షం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. వర్షం వెలిసిపోయినా ఫ్లోరిడాలో మ్యాచ్ నిర్వహించలేక పోయారు. దీనికి కారణం అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడమే. ఫ్లోరిడా స్టేడియంలో గ్రౌండ్‌ను పూర్తిగా కవర్ చేసేందుకు కవర్లు కూడా లేకపోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది. దీనిపై సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యారు. గ్రౌండ్‌ను కవర్ చేయలేని మైదానాల్లో మ్యాచ్‌లు నిర్వహించకూడదని ఐసీసీని కోరారు. ఫ్లోరియా స్టేడియంలో కేవలం పిచ్‌పై మాత్రమే కవర్లు కప్పి అవుట్ ఫీల్డ్‌ను అలాగే వదిలేశారు. దీనికి తోడు స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగాలేదు. దీని కారణంగా వర్షం ఆగినప్పటికీ మ్యాచ్‌ను నిర్వహించలేకపోయారు. తమ ఫేవరెట్ క్రికెటర్లను చూడటానికి ఎంతో దూరం నుంచి వచ్చిన ఫ్యాన్స్ ఇటువంటి కారణాల వల్ల వెనక్కి వెళ్లకూడదని అన్నారు. సునీల్ గవాస్కర్‌తో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రౌండ్‌ను కప్పడానికి కవర్లు కూడా లేవనే పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో తనకు అర్థం కావడం లేదన్నారు. మ్యాచ్‌ల నుంచి ఇంత డబ్బు వస్తున్నప్పటికీ వెట్ అవుట్ ఫీల్డ్ కారణంగా మ్యాచ్‌లు రద్దవుతున్నాయని అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram