T20 Worldcup 2024 Group C Preview | టీ20 వరల్డ్ కప్ గ్రూప్ సీలో త్రిముఖ పోటీ
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-ఏ, గ్రూప్-బిల్లో సూపర్-8కి ఎవరు వెళ్తారు అనగానే టక్కున చెప్పేయచ్చు. కానీ గ్రూప్-సి పరిస్థితి మాత్రం అలా లేదు. న్యూజిలాండ్, వెస్టిండీస్‌లతో పాటు షార్ట్ ఫార్మాట్‌లో బలమైన ఆఫ్ఘనిస్తాన్ ఈ జట్టులో ఉంది. కాబట్టి గ్రూప్-సిలో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. ఈ గ్రూప్‌లో ఏ జట్లు ఉన్నాయి? వాటి బలాలు, బలహీనతలు ఏంటి?

1. వెస్టిండీస్
టీ20ల్లో వెస్టిండీస్ జట్టు ఎప్పుడైనా బలంగానే కనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని క్రికెట్ లీగుల్లో వెస్టిండీస్ ఆటగాళ్లదే హవా నడుస్తూ ఉంటుంది. 2016లో ఒకసారి వీరు ట్రోఫీ కూడా గెలిచారు. ఆల్ రౌండర్లు, భారీ హిట్టర్లతో వెస్టిండీస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. రొవ్‌మన్ పావెల్, షిమ్రన్ హెట్‌మేయర్, నికోలస్ పూరన్, ఆండ్రీ రసెల్, రొమారియో షెపర్డ్‌లతో భయపెట్టే బ్యాటింగ్ ఆర్డర్ వీరి సొంతం. కానీ వీరి ఆటలో కన్సిస్టెన్సీ లేకపోవడం మైనస్. కానీ ఈ ప్రపంచకప్ హాట్ ఫేవరెట్స్‌లో వెస్టిండీస్ కూడా ఒకటి.