Australia Must Win Against India | ఆస్ట్రేలియా నిలవాలంటే భారత్‌పై గెలవాల్సిందే | ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In App2023 వరల్డ్ కప్ ఫైనల్ భారత క్రికెట్ అభిమానుల మనస్సులో ఒక చెరిగిపోని గాయం. సొంత గడ్డపై లక్ష మంది భారతీయుల ముందు ఆస్ట్రేలియా చెప్పి మరీ టీమిండియాను ఓడించింది. ఆ వెంటనే ఇండియాలోనే జరిగిన టీ20 సిరీస్‌లో భారత్... ఆస్ట్రేలియాను 4-1తో చిత్తుగా ఓడించింది. కానీ టీమిండియా ఫ్యాన్స్‌కు కిక్కు సరిపోలేదు. ఇప్పుడు ఫ్యాన్స్‌కు సూపర్ కిక్కిచ్చే ఛాన్స్ టీమిండియాకు వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ - 8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఘోర పరాజయం పాలైంది. దీంతో ఆస్ట్రేలియా టోర్నమెంట్లో నిలవాలంటే భారత్‌తో జరగాల్సిన మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోతే వారి సెమీస్ దారులు దాదాపు మూసుకుపోయినట్లే. ఇలాంటి కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ టీమిండియాకు వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి ఆస్ట్రేలియా ఇంటి ముఖం పడితే మాత్రం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం.