USA vs ENG Super 8 Match Highlights | USA పై విజయంతో సెమీస్ కు వెళ్లిన ఇంగ్లండ్ | T20 World Cup 2024

Continues below advertisement

టీ 20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో సౌతాఫ్రికా మీద ఓడిపోయిన ఇంగ్లండ్...సౌతాఫ్రికా వరుసగా రెండు మ్యాచులు గెలిచినా కూడా ఆ టీమ్ ను తొక్కి పెట్టి సెమీస్ కు వెళ్లిపోయింది. రీజన్ అమెరికాపై పదివికెట్ల తేడాతో ఘన విజయం సాధించి నెట్ రన్ రేట్ ను భారీ గా పెంచుకోవటమే. బ్రిడ్జిటౌన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన అమెరికా బ్యాటింగ్ లో తేలిపోయింది. నితీశ్ కుమార్, కొర్రే అండర్సన్ తప్ప మిగిలిన బ్యాటర్లు అంతా చేతులెత్తేయటంతో 115పరుగులకు ఐదువికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ మరింత విధ్వంసం చేశాడు. 19వ ఓవర్ వేసిన జోర్డాన్ ఒకే ఓవర్ లో హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొదటి బంతికి కొరే అండర్సన్ ను అవుట్ చేసిన జోర్డాన్..రెండో బంతికి సింగిల్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా మూడు బంతుల్లోనూ వికెట్లు తీసి హ్యాట్రిక్ ను నమోదు చేసుకున్నాడు. ఈ వరల్డ్ కప్ లో ఇది మూడో హ్యాట్రిక్. వరుసగా రెండు మ్యాచుల్లో రెండు హ్యాట్రిక్స్ ప్యాట్ కమిన్స్ నమోదు చేయగా..మూడో హ్యాట్రిక్ క్రిస్ జోర్డాన్ తీసుకున్నాడు. జోర్డాన్ ధాటికి 115పరుగులకు 5వికెట్లు గా ఉన్న అమెరికా అదే స్కోరు మీద ఆలౌట్ అయిపోయింది. 116పరుగుల చిన్న టార్గెట్ తో ఛేజింగ్ దిగిన ఇంగ్లండ్..సెమీస్ కు వెళ్లాలంటే నెట్ రన్ రేట్ కీలకమయ్యే అవకాశం ఉన్నందును వేగంగా టార్గెట్ ను ఛేజ్ చేయాలని ఫిక్స్ అయ్యింది. ముఖ్యంగా ఇంగ్లండ్ ఓపెనర్, కెప్టెన్ జోస్ బట్లర్ చెలరేగిపోయి ఆడాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ ను జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయటానికి పరిమితం చేస్తూ 38 బాల్స్ లో 6ఫోర్లు, 7సిక్సర్లతో 83పరుగులు చేశాడు బట్లర్. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ లో అయితే USA బౌలర్ హర్మీత్ సింగ్ ను టార్గెట్ చేసి విరుచుకుపడ్డాడు బట్లర్. వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సులు బాది ఇంగ్లండ్ కు భారీగా నెట్ రన్ రేట్ మిగిల్చేలా చేశాడు. ఇంగ్లండ్ సాధించిన ఈ విజయంతో USA సూపర్ 8 నుంచి ఎలిమినేట్ కాగా... సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే ఇంగ్లండ్ సెమీస్ కు వెళ్లిపోయింది. సౌతాఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్ బీలో రెండో సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంటుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram