T20 Worldcup India Super 8 Schedule - టీమిండియా సూపర్ 8 షెడ్యూల్ ఇదే

Continues below advertisement

T20 World Cup 2024 Super 8 India full Schedule: టీ20 ప్రపంచకప్‌లో భారత్... యూఎస్ఏపై విజయంతో సూపర్-8కు చేరుకుంది. ప్రస్తుతానికి భారత్‌తో పాటు వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సూపర్-8కు చేరుకున్నాయి. మరో నాలుగు స్థానాల కోసం పోటీ జరుగుతుంది.

సూపర్-8లో టీమిండియా తన మొదటి మ్యాచ్‌ను జూన్ 20వ తేదీన ఆడనుంది. గ్రూప్-సిలో జట్టుతో భారత్ తలపడనుంది. వెస్టిండీస్ ఇప్పటికే సూపర్-8లో మరో గ్రూపులో చేరింది కాబట్టి భారత్ ఈ మ్యాచ్‌ను ఆప్ఘనిస్తాన్‌తో ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది. వెస్టిండీస్‌లో బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

భారత్ తన రెండో మ్యాచ్‌ను జూన్ 22వ తేదీన గ్రూప్-డిలో ఉన్న జట్టుతో ఆడనుంది. ప్రస్తుతం గ్రూప్-డిలో ఉన్న ఈక్వేషన్లను బట్టి చూస్తే బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌ల్లో ఒక జట్టుతో ఈ మ్యాచ్ జరగనుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గ్రూప్ నుంచి ఇప్పటికే క్వాలిఫై అయిన దక్షిణాఫ్రికా సూపర్-8లో వేరే గ్రూప్‌లో చేరింది. శ్రీలంక అధికారికంగా ఎలిమినేట్ అయిపోయింది.

ఇక సూపర్-8 దశలో తమ చివరి మ్యాచ్‌లో భారత్... బలమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. జూన్ 24వ తేదీన సెయింట్ లూసియా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే గ్రూప్-బి నుంచి సూపర్-8కు చేరుకుంది. సూపర్-8లో మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ఒక్కో గ్రూపు నుంచి టాప్-2 జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram