T20 Worldcup 2024 - గ్రూప్ దశలోనే శ్రీలంక అవుట్

Continues below advertisement

Cricket Videos in Telugu: టీ20 ప్రపంచకప్ నుంచి శ్రీలంక అఫీషియల్‌గా అవుట్ అయింది. గురువారం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 25 పరుగులతో విజయం సాధించింది. దీంతో శ్రీలంక సూపర్-8 రేసు నుంచి తప్పుకుంది. టెస్టు హోదా ఉన్న జట్లలో 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి అఫీషియల్‌గా అవుట్ అయిన జట్టుగా శ్రీలంక నిలిచింది.

ఈ ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక ఒక్క విజయం కూడా సాధించలేదు. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగా... నేపాల్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో మూడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క పాయింట్‌తో టేబుల్లో చివరి స్థానంలో నిలిచింది. ఈ గ్రూప్ నుంచి దక్షిణాఫ్రిక ఇప్పటికే సూపర్-8కు చేరుకుంది. రెండో స్థానంలో కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య పోటీ ఉంది.

అయితే ఈ ప్రపంచకప్‌లో మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. గ్రూప్-ఏ నుంచి పాకిస్తాన్, గ్రూప్-సి నుంచి న్యూజిలాండ్ కూడా ఎలిమినేషన్‌కు చాలా దగ్గరలో ఉన్నాయి. మరోవైపు ఒమన్‌పై భారీ విజయంతో గ్రూప్-బిలో ఇంగ్లండ్ అనూహ్యంగా తిరిగి రేసులోకి వచ్చింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram