Suryakumar Yadav on Ind vs Pak T20 World Cup | పాక్ పై సూర్య కామెంట్స్

Continues below advertisement

టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) అత్యంత ఆసక్తికరమైన భారత్-పాకిస్థాన్. కానీ పాకిస్తాన్ మాత్రం లీగ్ స్టేజ్ లో ఇండియాతో జరిగే మ్యాచ్ ను ఆడబోమని తేల్చి చెపింది. ఈ విషయంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) సంచలన వ్యాఖ్యలు చేశారు. 

భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, సూర్య మాట్లాడుతూ.. "మేము మ్యాచ్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాం.. మా ప్లాన్లలో ఎలాంటి మార్పు లేదు" అంటూ పాక్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "మేము చాలా స్పష్టంగా ఉన్నాము. వాళ్లతో ఆడమని ఎప్పుడూ చెప్పలేదు. పాకిస్థానే ఆడనని అంటోంది. కొలంబోకు వెళ్లేందుకు మా ఫ్లైట్ టికెట్లు ఇప్పటికే బుక్ అయ్యాయి. ముందుగా యూఎస్‌ఏ, తర్వాత నమీబియా, ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం కొలంబో చేరుకుంటాం" అని అన్నారు సూర్య. పాక్ నిర్ణయంతో సంబంధం లేకుండా ఐసీసీ నిబంధనల ప్రకారం టీమిండియా అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తుందని ఆయన వెల్లడించారు.

ఒకవేళ పాకిస్థాన్ మ్యాచ్ సమయానికి రాకపోతే, నిబంధనల ప్రకారం భారత్‌కు 'వాకోవర్' (Walkover) విజయం లభిస్తుంది. అంటే మ్యాచ్ ఆడకుండానే టీమిండియా ఖాతాలో 2 పాయింట్లు చేరుతాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola