Suryakumar Press Meet Ind vs Pak | Asia Cup 2025 | ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

ఆసియా కప్ 2025లో రెండోసారి పాకిస్తాన్ భారత్ చేతిలో ఓటిమి పాలయింది. ఈసారి జరిగిన మ్యాచులో మాటల యుధాలు మాత్రమే కాదు ... అంతకు మించి అన్నట్టుగా జరిగాయి. గ్రూప్ స్టేజ్‌లో వన్ సైడ్‌గా మ్యాచ్ జరిగింది. కానీ సూపర్ 4లో మాత్రం మనవాళ్లు ఎక్కడా తగ్గలేదు. అభిషేక్ శర్మ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దానికి తోడుగా పాక్ ప్లేయర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ గన్ షాట్ సెలబ్రేషన్స్‌ తో మ్యాచ్ ఇంకా రసవత్తరంగా మారింది. చివరికి ఇండియా విజయం సాధించింది. మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిపడేశాడు.

రైవల్రీ గురించి అడగడం ఆపేయాలి అంటూ సమాధానం చెప్పాడు. "రైవల్రీ అనిపించాలంటే.. రెండు టీమ్స్ 15 - 20 మ్యాచ్‌లు ఆడితే 7 -7, 8 - 7 ఇలా అటూఇటుగా ఉండాలి. అలా కాకుండా 13 - 0, 10 - 1గా ఉంటే దాన్ని ఎలా రైవల్రీ అంటారు? అసలు స్టాట్స్ నాకు తెలియదు. కానీ వాళ్లకంటే 7 -15 మధ్య మంచి క్రికెట్ ఆడాం, బౌలింగ్ కూడా మెరుగ్గా చేశాం" అంటూ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. కెప్టెన్ సమాధానంతో ఫ్యాన్స్ అంతా సంబరపడిపోతున్నారు. సూర్యకుమార్ సర్రిగా బదులిచ్చారని అంటున్నారు. టీ20 వరల్డ్ కప్ 2021 తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ప్రతి మ్యాచ్‌లోనూ టీమిండియానే విజయం సాధించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola