Abhishek Sharma India vs Pakistan | Asia Cup 2025 | రెచ్చిపోయిన అభిషేక్ శర్మ
ఆసియా కప్ లో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్ లో అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టి రికార్డు నమోదు చేసుకున్నాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఫస్ట్ బాల్ ను సిక్స్ కొట్టాడు అభిషేక్. ఆలా రెండు సార్లు ఈ ఘనతను సాధించిన తొలి భారత క్రికెటర్ గా రికార్డు సాధించాడు. అయితే షాహీన్ ఇప్పటి వరకు 70 సార్లు ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేశాడు. తన బౌలింగ్ లో ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టిన తొలి బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మనే.
మ్యాచ్ మధ్యలో అభిషేక్ శర్మ, రౌఫ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. దాంతో అంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై అభిషేక్ స్పందిస్తూ... పాకిస్థాన్ ప్లేయర్స్ అనవసరంగా దూకుడుగా ప్రవర్తించారని అన్నాడు. అందుకే తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చానన్నాడు.
తన బ్యాటింగ్ తో పాకిస్తాన్ బౌలర్లకు అభిషేక్ శర్మ చుక్కలు చూపించాడు. 39 బంతుల్లో 74 పరుగులు చేసి భారత్ విజయం దిశగా ముందుకు తీసుకెళ్లాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్ చేసిన ట్విట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గిల్ తన పోస్ట్‌లో, “ Game speaks, not words 🇮🇳" అని రాసుకొచ్చాడు. అభిషేక్ కూడా “You talk, we win ” అని క్యాప్షన్ ఇచ్చాడు.